IND vs AUS 3rd Test: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. అశ్విన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పెషల్ గిఫ్ట్

IND vs AUS 3rd Test: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. అశ్విన్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పెషల్ గిఫ్ట్

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అకస్మాత్తుగా అశ్విన్ తీసుకున్న  నిర్ణయం భారత క్రికెట్ ను షాకింగ్ కు గురి చేసింది. బ్రిస్బేన్‌లో బుధవారం( డిసెంబర్ 18)  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో భారత క్రికెటర్లు ఈ వెటరన్ స్పిన్నర్ కు గ్రాండ్ గా ఫేర్ వెల్ ఇచ్చారు. 

కేక్ కట్ చేసి చప్పట్లతో అశ్విన్ కు గ్రాండ్ గా వీడ్కోలు తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లు ఎమోషనల్ కాగా.. అశ్విన్ తన అద్బుతమైన స్పీచ్ తో ఈ ఫేర్ వెల్ కు ఘనంగా ముగింపు పలికాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ప్లేయర్లు అశ్విన్ కు ఊహించని  సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్, నాథన్ లియోన్ అశ్విన్ దగ్గరకు వచ్చి జెర్సీని బహుకరించారు. ఈ జెర్సీపై ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంతకాలు ఉండడంతో అశ్విన్ షేక్ హ్యాండ్ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. 

Also Read:-2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే..

అశ్విన్‌‌‌‌కు టెస్టు ఫార్మాట్‌‌లో గొప్ప రికార్డు ఉంది. 2011లో ఢిల్లీలో వెస్టిండీస్‌‌‌‌పై అరంగేట్రం టెస్టు మ్యాచ్‌‌లోనే ప్లేయర్‌‌‌‌ ఆఫ్  ద మ్యాచ్‌‌ నిలిచాడు. ఈ ఫార్మాట్‌‌‌‌లో అత్యధికంగా 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌‌‌‌లు గెలిచిన బౌలర్‌‌‌‌‌‌‌‌గా మురళీధరన్‌‌‌‌ సరసన నిలిచాడు.  టెస్టుల్లో తను 37సార్లు ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ చేశాడు. ఎనిమిదిసార్లు 10 వికెట్ల హాల్స్ సాధించడం అతని సత్తాకు నిదర్శనం. మేటి జట్లపై అశ్విన్ మరింత మెరుగ్గా ఆడాడు.  ఆస్ట్రేలియాపై 115  టెస్టు వికెట్లు సాధించిన అతను  ఇంగ్లండ్‌‌‌‌పై 114 వికెట్లు పడగొట్టాడు. బోర్డర్-– -గావస్కర్ ట్రోఫీలో 115 వికెట్లు పడగొట్టాడు. 

అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్ లో అశ్విన్ ఆడతాడు. అతను 2025 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.