Nathan Lyon: అశ్విన్ రికార్డు బ్రేక్.. అత్యధిక వికెట్ల వీరుడిగా నాథన్ లియాన్

Nathan Lyon: అశ్విన్ రికార్డు బ్రేక్.. అత్యధిక వికెట్ల వీరుడిగా నాథన్ లియాన్

ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ ఈ ఘనత సాధించాడు. తొలిరోజు ఆటలో శుభమాన్ గిల్‌ను పెవిలియన్ చేర్చిన వెంటనే.. లియాన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

అతకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. అశ్విన్ 78 ఇన్నింగ్స్‌లల్లో 195 వికెట్లు పడగొట్టగా.. లియాన్ 85 ఇన్నింగ్స్‌లల్లో 196 వికెట్లు తీశాడు. 

ALSO READ | Virat Kohli: ఇమ్రాన్ హష్మీకి లిప్స్.. కోహ్లీకి స్లిప్స్: ఇది మామూలు ట్రోలింగ్ కాదు

డబ్ల్యూటీసీ(WTC) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

  • నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా): 196 (85 ఇన్నింగ్స్‌ల్లో)
  • ఆర్ అశ్విన్ (భారత్): 195 (78 ఇన్నింగ్స్‌ల్లో)
  • పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా): 195 (87 ఇన్నింగ్స్‌ల్లో)
  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా): 163 (82 ఇన్నింగ్స్‌ల్లో)
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్): 154 (65 ఇన్నింగ్స్‌ల్లో)