పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిక్యం 400 పరుగులు దాటింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఓపెనర్లతో పాటు కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో పంత్ విఫలమయ్యాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. లియాన్ తన అద్భుతమైన బౌలింగ్ తో పంత్ ను బోల్తా కొట్టించడం విశేషం.
ఇన్నింగ్స్ 96 ఓవర్ తొలి బంతి ఆడేందుకు పంత్ క్రీజ్ దాటి బయటకు వచ్చాడు. ఇది గమనించిన ఆసీస్ స్పిన్నర్ లియాన్ ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతిని విసిరాడు. అయితే అప్పటికే క్రీజ్ భారీగా దాటిన పంత్ స్టంపౌటయ్యాడు. బ్యాట్ క్రీజ్ పెట్టేందుకు ప్రయత్నించినా అది జరగలేదు. దీంతో నిరాశగా డగౌట్ వైపుకు వెళ్ళాడు. గతంలో లియాన్ బౌలింగ్ లో పంత్ భారీ షాట్స్ తో అలరించాడు. లియాన్ మీద పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఈ సారి మాత్రం లియాన్ వలలో చిక్కాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
Also Read :- ఆసక్తి చూపించని ప్లేయర్‌ను కొన్న పంజాబ్
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి పంత్ రాణించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజ్ లో క్యారీ (2), స్తర్క్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా గెలవాలంటే మరో 352 పరుగులు చేయాలి. మరో వైపు భారత్ విజయానికి 3 వికెట్లు చాలు.