
వెల్లింగ్టన్ : వెటరన్ స్పిన్నర్ నేథన్ లైయన్ (6/65) ఆరు వికెట్లతో విజృంభించడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు, ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 172 రన్స్ తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. రెండు మ్యాచ్‌లో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆసీస్ ఇచ్చిన 369 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 111/3తో ఆట కొనసాగించిన ఆతిథ్య కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 196 రన్స్‌కే ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (59), డారిల్ మిచెల్ (38), స్కాట్ కుగెలిన్ (26) తప్ప మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు. లైయన్‌కు తోడు జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి లైయన్ పది వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ కొట్టిన గ్రీన్‌కు ప్లే యర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టెస్టు ఈనెల 8 నుంచి జరుగుతుంది.