WTC Final: ఒక్క మ్యాచ్ కాదు.. సిరీస్‌లా జరపాలి.. రోహిత్ నిర్ణయాన్ని సమర్ధించిన ఆసీస్ స్పిన్నర్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలు అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకున్నా భారత్ కు నిరాశ తప్పలేదు. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది.

రెండు సార్లు భారత్ టేబుల్ టాపర్ గా నిలిచినా ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది. దీంతో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఛాంపియన్  షిప్ పై గతంలో ఫైనల్ పై కీలక సూచనలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మూడు మ్యాచ్ ల సిరీస్ గా జరగాలని  తన అభిప్రాయాన్ని తెలిపాడు. రోహిత్ వ్యాఖ్యలకు తాజాగా ఆసీస్ స్టార్ స్పిన్నర్ సమర్ధించాడు.

ALSO READ | IPL 2025: అధికారిక ప్రకటన.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

"వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఒకే మ్యాచ్ గా కాకుండా మూడు మ్యాచ్ ల సిరీస్ గా జరపాలి. టెస్ట్ మ్యాచ్ లో  సెషన్ తో మ్యాచ్  మారిపోతుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా  పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు జట్లకు ఇది ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ ఒక్క  చేయాలని నేను కోరుకుంటున్నాను" అని లియాన్ రోహిత్ మాటలకు ఏకీభవించాడు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్  విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనున్నాయి. న్యూజిలాండ్ (3), ఇంగ్లండ్ (4), శ్రీలంక (5), దక్షిణాఫ్రికా (6), బంగ్లాదేశ్ (7) టాప్ 2 లో చోటు సంపాదించాలని ధీమాగా ఉన్నాయి. వచ్చే ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది.