IND vs NZ Final: హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్.. ఎవరీ కివీస్ అల్ రౌండర్

IND vs NZ Final: హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్.. ఎవరీ కివీస్ అల్ రౌండర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ప్రారంభమైంది.  టైటిల్ కోసం తుది సమరంలో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. బౌలర్ హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. అనుకున్నట్టుగానే న్యూజిలాండ్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. భుజం కారణంగా ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ దూరం కాగా అతని స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. దీంతో ఈ స్మిత్ ఎవరని నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.      

ఎవరీ నాథన్ స్మిత్..?

నాథన్ స్మిత్ న్యూజిలాండ్ బౌలింగ్ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు చేయగలడు. 26 ఏళ్ళ ఈ కివీస్ ఆల్ రౌండర్ పవర్ ప్లే తర్వాత లెగ్ కట్టర్, ఆఫ్ కట్టర్ లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. 2024 నవంబర్ లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 8 వన్డేల్లో 7 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి న్యూజిలాండ్ జట్టులో స్థానం సంపాదించాడు. 

హెన్రీకి ఏమైంది..?

లాహోర్ వేదికగా బుధవారం(మార్చి 5) సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో హెన్రీ గాయపడ్డాడు. హెన్రిచ్ క్లాసెన్‌ను క్యాచ్ పట్టడానికి డైవ్ చేసిన ఈ కివీస్ పేసర్ భుజానికి గాయమైంది. కాసేపు గ్రౌండ్ లో ఇబ్బందిపడ్డారు.ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో మాట్ హెన్రీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 16.70 యావరేజ్ తో 10 వికెట్లు పడగొట్టి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటి 27 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.     

ALSO READ | IND vs NZ Final: ఫైనల్లో టాస్ ఓడిన భారత్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. హెన్రీ ఔట్