రాష్ట్రవ్యాప్తంగా3,342 స్కూళ్లలో.. న్యాస్ సర్వే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (న్యాస్) బుధవారం జరగనున్నది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా3,342 స్కూళ్లలో బుధవారం10.30గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కానున్నది. ఈ పరీక్షకు 3, 6, 9 క్లాసులకు చెందిన సుమారు లక్ష మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు. ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే దేశవ్యాప్తంగా తెలంగాణ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించనున్నది. దీంతో ఈ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​ గా తీసుకొని నిర్వహిస్తోంది.