జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

రోడ్డు దాటుతూ ఓ పులి కెమెరాకు చిక్కింది. తమిళనాడులోని వాల్పరై హిల్ స్టేషన్ రోడ్డులో పులి దర్జాగా రోడ్డు దాటుతూ కనిపించింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్వీట్ చేశాడు. ఆయన ఈ వీడియోకు ‘నేషనల్ హైవేపై నేషనల్ యానిమల్’ అని ట్యాగ్ చేశాడు. అంతేకాకుండా.. 15 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో క్రెడిట్ అంతా ఫోటోగ్రాఫర్ రాజ్ మోహన్‌కే చెందుతుందని ఆయన అన్నారు. రాజ్ మోహన్ ప్రకారం.. ఆయన, తన భార్యతో కలిసి వాల్పరై రోడ్డులో వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేసిన ఈ వీడియో.. సుమారు 46 వేల వ్యూస్‎ను సాధించింది.

For More News..

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశం శాశ్వతం