జగిత్యాల పట్టణంలో ని టవర్ సర్కిల్ ప్రాంతంలో జులై 22వ తేదీ శనివారం ఉదయం పెద్దపులి వేషధారణలో జాతీయ గీతాలాపన చేయడం అందరిని ఆకట్టుకుంది. పీర్ల పండగ సందర్భంగా కొందరు భక్తులు.. పెద్ద పులి వేష ధారణ వేశారు. అయితే ఈ సమయంలో అక్కడే గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతోంది. దీంతో పెద్ద పులుల వేషధారణలో అక్కడే ఉన్న భక్తులు బయటకు వచ్చి జాతీయ గీతాలాపన చేశారు. ఒక వైపు దైవ భక్తి చాటుతునే.. మరో వైపు దేశ భక్తి చాటడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
JGTL TIGERS DANCE pic.twitter.com/8SWotCdReW
— GSREDDY (@GSreddymedia) July 22, 2023