![ఫిబ్రవరి10న అప్రెంటిషిప్ మేళా](https://static.v6velugu.com/uploads/2025/02/national-apprenticeship-mela-to-be-held-in-vikarabad-on-february-10_rGeDhpRkV7.jpg)
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఐటీఐలో ఫిబ్రవరి10న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్.నరేంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని, ఐటీఐ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మేళాకు వచ్చేవారు పదో తరగతి, ఐటీఐ మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ తోపాటు పూర్తి వివరాలతో బయోడేటా ఫారాన్ని వెంట తెచ్చుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9177472488 ను సంప్రదించాలన్నారు.