హైదరాబాద్ నిజాం కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్

హైదరాబాద్ నిజాం కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ నిజాం కాలేజీకి నేషనల్ అసెస్ మెంట్అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ఇచ్చింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కాలేజీకి ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.వి. రాజశేఖర్ తెలిపారు. సోమవారం బషీర్ బాగ్ లోని కాలేజీలో  ఆయన మీడియాతో మాట్లాడారు. కాలేజీకి చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే  ఏ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించామని చెప్పారు. 

క్వాలిటీ విద్యను అందించడంతోపాటు విద్యార్థులు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడా,  ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ  వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఏ గ్రేడ్ లభించడం తమకెంతో ఉత్సాహాన్ని,  ప్రోత్సాహాన్ని అందించిందని... ఇక ముందు కూడా  టీం వర్క్ తో కాలేజీలోని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరం కలిసి  పనిచేస్తామని స్పష్టం చేశారు.