69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో గురువారం(ఆగస్టు 24) సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించింది జ్యురీ. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 31 కేటగిరీలకు గాను అవార్డులను ప్రకటిస్తుండగా.. నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 24 కేటగిరీలకు గాను అవార్డులను ప్రకటించనున్నారు.
ఇక ఈ 2023 ఉత్తమ చిత్రం తెలుగుకు గాను ఉప్పెన సినిమా నిలిచింది. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమాను బుచ్చిబాబు సనా తెరకెక్కించగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాదించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల గగ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.