వరంగల్, కరీంనగర్ కమిషనర్ లకు బీసీ కమిషన్ నోటీసులు

వరంగల్ జిల్లా: వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ లకు జాతీయ బీసీ కమిషన్ నోటిసులు జారీ చేసింది. పోలీసు అధికారులపై బీసీ కమిషన్ కు  హన్మకొండ జిల్లా, కమలాపూర్ చెందిన కరట్లపల్లి దశరథం ఫిర్యాదు చేశాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తనపై తప్పుడు కేసు నమోదు చేసి బెదిరిస్తున్నారని బీసీ కమిషన్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆ అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కమిషన్ ను కోరాడు. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీ కమిషన్.. ఆర్టికల్ 338బీ కింద ఇరు కమిషనర్ లకు నోటీసులు ఇచ్చింది. ఫిర్యాదు విషయంలో విచారణ జరిపి.. 5 పనిదినాల్లోగా నివేదికను సమర్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. నిర్ణీత సమయంలోగా సమాధానం ఇవ్వకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338Bలోని క్లాజ్ (8) ప్రకారం సివిల్ కోర్టు అధికారాలను వినియోగించునుంటామని హెచ్చరించింది.