బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్.. బీసీ కమిషన్ విచారణ

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ బీసీ కమిషన్ ఈరోజు విచారించనుంది. ఈ నెల 2న కరీంనగర్ లో 317జీవోను సవరించాలంటూ బండి సంజయ్ జాగరణ దీక్షకు దిగారు. దీంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో బండి సంజయ్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు నేషనల్ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరు కావాలని కరీంనగర్ సీపీ సత్యనారాయణకు బీసీ కమిషన్ నోటీసులిచ్చింది. ఈరోజు మధ్యాహ్నాం 12 గంటలకు బీసీ కమిషన్ సభ్యులు ఆచారి సీపీని విచారించనున్నారు. 

ఇవి కూడా చదవండి:

వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

ఫైన్​ కట్టి చదివించింది..