నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు.. ఇది ఇన్నాళ్లూ మన టాలీవుడ్‌కు తీరని కల! ఇప్పుడు ఆ కల సాకారమైంది!!
‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సగర్వంగా ఆ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి 11 పురస్కారాలు దక్కాయి. ఆస్కార్ వేదికపై జెండా పాతిన ‘ఆర్ఆర్ఆర్’కు ఆరు.. రికార్డులు బ్రేక్ చేసిన ‘పుష్ప’కు రెండు జాతీయ అవార్డులు జై కొట్టాయి.
అల్లు.. అభినందనల జల్లు
అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావడం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది. పలువురు సినీరంగ ప్రముఖులు, తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు బన్నీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్.తెలుగు సినిమాకు ఇది ప్రౌడ్ మూమెంట్. బన్నీకి ప్రత్యేక అభినందనలు. నిన్ను చూసి గర్వపడుతున్నాను.
– చిరంజీవి
‘కంగ్రాచ్యులేషన్స్అల్లు అర్జున్ బావా. ‘పుష్ప’ సినిమాసక్సెస్‌లో, అవార్డులను సాధించడంలో నువ్వు అర్హుడివి’
– ఎన్టీఆర్
‘పుష్ప..తగ్గేదేలే..కంగ్రాట్స్ బన్నీ’
- రాజమౌళి
తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటివరకూ రాని ఒక అద్భుతాన్ని తీసుకొచ్చిన.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, ఈ చిత్ర దర్శకనిర్మాతలకు, ప్రత్యేకంగా మా కుటుంబ ఖ్యాతిని పతాక స్థాయికి తీసుకెళ్లిన మా అబ్బాయికి నా కృతజ్ఞతలు.
– అల్లు అరవింద్
తెలుగు సినిమా గర్వించే రోజు ఇది. నా వందవ చిత్రంతో పరిచయం చేసిన అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
– కె.రాఘవేంద్రరావు
‘అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం, అందులోనూ మేము నిర్మించిన 'పుష్ప' చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం గర్వంగా వుంది. ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది. అలాగే 'ఉప్పెన' చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికవడం చాలా అనందంగా ఉంది’
- నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్