చిల్డ్రన్ డే.. మదర్స్ డే.. ఫాదర్స్ డే.. ఉమెన్స్ డే.. లవర్స్ డే.. ఉన్నట్లే.. చరిత్రలో బాయ్ ఫ్రెండ్ డే ఒకటి ఉందని తెలుసా.. చాలా మందికి తెలియదు.. చరిత్రలో మాత్రం బాయ్ ఫ్రెండ్ డే ఒకటి ఉంది.. ప్రపంచంలో ఏ దేశం దీన్ని అధికారికంగా గుర్తించకపోయినా.. ఎవరికి వాళ్లు.. ఆయా దేశాల్లో జరుపుకోవటం ఆనవాయితీ. అక్టోబర్ 3వ తేదీ.. ప్రతి సంవత్సరం.. ఈ తేదీన.. ప్రపంచ బాయ్ ఫ్రెండ్ డే జరుపుకుంటారు. అక్టోబర్ 3వ తేదీని బాయ్ ఫ్రెండ్ డే అని నెటిజన్లు, యూత్ ఫిక్స్ అయిపోయారు.
ఆయా రోజును తమ బాయ్ ఫ్రెండ్ కు విషెస్ చెప్పటంతోపాటు లవ్ ప్రపోజల్ చేయటం 35 ఏళ్లుగా జరుగుతూ వస్తుంది. సోషల్ మీడియా యుగంలో ఇది కొంచెం ఎక్కువగా ట్రెండ్ కావటం విశేషం. 2023, అక్టోబర్ 3వ తేదీ మంగళవారం వచ్చింది.. ఈ సారి బాయ్ ఫ్రెండ్ డే కోసం.. వాట్సాప్ మెసేజ్ లతోపాటు.. టెక్ట్స్ మెసేజీలు ఎలా చెప్పాలో ఓ లుక్కేద్దామా..
వాట్సాప్ అండ్ టెక్ట్స్ మెసేజీలు :
టెక్ట్స్ మెసేజీలు :
- నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నేను చాలా తక్కువగా ఏడ్చాను.. ఎక్కువగా నవ్వాను.. నవ్వుతూనే ఉంటాను.. గతం కంటే నా జీవితం హ్యాపీగా ఉంది.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే మై డియర్
- నువ్వు నా జీవిత భాగస్వామి కంటే ఎక్కువ.. నువ్వు నా ఆత్మ.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- నువ్వు నా దగ్గర ఉంటే అదే నా స్వర్గం.. జీవితాంతం సంతోషం నా వెంటే.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- ప్రేమకు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఉండవని.. నేను నిన్ను కలిసిన తర్వాతే తెలిసింది.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- మన బంధం బలహీనమైనది కాదని.. ఈ ప్రపంచానికి చెబుదాం.. నువ్వు నా వెంటే ఉంటే అది నిజం అవుతుంది. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- మనం కలిసినప్పటి నుంచి ప్రతి క్షణం అద్భుతమే.. ఇలాగే కొనసాగాలని.. కొనసాగుతుందని నేను మాటిస్తున్నాను.. నువ్వు మాటిస్తావా.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- నిజమైన ప్రేమికుడు ఎలా ఉంటాడో నిన్ను కలిసిన తర్వాతే తెలిసింది.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను.. నువ్వు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే మై డియర్
వాట్సాప్ మెసేజ్ లు
- కొన్నిసార్లు నాకు ఇదంతా కలలా అనిపిస్తుంది. కానీ అది నిజమని తెలిసి నేనెంత అదృష్టవంతురాలిని అనుకుంటాను. నువ్వు నా వాడివైనందుకు థ్యాంక్యూ.
- సంవత్సరాలు గడిచేకొద్దీ, నేను నీ గురించి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. నువ్వు నాకు అత్యంత అద్భుతమైన వ్యక్తివి.
- నువ్వు నా దగ్గర లేనప్పుడు.. నీ అందమైన ముఖాన్ని, చిరునవ్వును మిస్ అవుతూ ఉంటాను.. హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ డే
- నేను నీ దగ్గర ఉన్నంతసేపు అత్యంత సంతోషంగా, సురక్షితంగా ఉన్నట్టనిపిస్తుంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.
- మనం పంచుకునే ప్రేమను వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. నేను నీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నాను.
- నీతో ప్రేమలో పడే వరకు నా జీవితం అసంపూర్ణంగా అనిపించేది. నువ్వు వచ్చాకే నా జీవితం పరిపూర్ణమైంది. మనం విడిపోయిన ప్రతిసారీ నేను అసంపూర్ణంగానే భావిస్తున్నాను. నా మిగిలిన సగం నువ్వే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
- నువ్వు నా జీవితానికి వెలుగు లాంటివాడవు. నువ్వు లేని ఈ ప్రపంచం అంతా చీకటిగా అనిపిస్తుంది.
- నీతో ఈ జీవిత ప్రయాణంలో నడవడం చాలా అద్భుతమైన అనుభవం.