ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్న పారా అథ్లెట్ సచిన్ సాహు

దేశానికి గొప్ప గొప్ప మెడల్స్ అందించి భారతీయులను గర్వపడేలా చేసిన కొందరు క్రీడాకారులు నేడు కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థికరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో కష్టాలు పడుతున్నారు. 

నేషనల్‌ చాంపియన్‌ (పారా అథ్లెట్‌) సచిన్‌ సాహు జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్‌ బండి నడుపుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సచిన్‌ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్‌ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్‌ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

2015 నుండి 2019 వరకు సచిన్ క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత గ్వాలియర్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ బీకే ధవన్‌ సాయంతో పారా అథ్లెట్‌గా మారాడు. కాంస్య పతకం కూడా సాధించాడు.