లిక్కర్ ఫ్యాక్టరీలో బాలకార్మికులుగా పని చేస్తున్న 50 మంది బాల, బాలికలను నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) రక్షించింది. మధ్యప్రదేశ్‌లోని రైసిన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెహత్‌గంజ్‌లోని సోమ్ డిస్టిలరీస్, బ్రూవరీస్‌లో బాల కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు.
शर्मनाक तस्वीर !!!
— Naveen Singh (@Naveen_K_Singh_) June 15, 2024
भोपाल के नज़दीक सोम डिस्टिलरी की ये तस्वीर बता रही है कि MP के आबकारी विभाग ने अपनी आंखें क्यों मूंद रखी हैं..
50 नाबालिग बच्चे 20 लड़कियों समेत शराब बनवाने के काम में लगे थे,उसी परिसर में आबकारी का दफ्तर भी था..@DrMohanYadav51 जी छोड़िएगा नहीं इन लोगों को. pic.twitter.com/i3XVr0cH5V
శనివారం తమ బృందంతో కలిసి అక్కడ రైడ్ చేసినట్లు చెప్పారు. సుమారు 50 మంది బాల, బాలికలను రక్షించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ రైడ్‌పై ఎక్స్ వేదికగా స్పందించారు. కార్మిక, ఎక్సైజ్, పోలీసు శాఖల నుంచి పూర్తి సమాచారాన్ని కోరినట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు.
పిల్లలను స్కూల్ బస్సులో మద్యం ఫ్యాక్టరీకి తరలించి పనులు చేయిస్తున్నట్లు తమకు తెలిసిందని ప్రియాంక్ కనుంగో అన్నారు. రసాయనాల వల్ల పిల్లల చేతులు పాడయ్యాయని, రక్షించిన పిల్లలను అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ పిల్లలు మద్యం ఫ్యాక్టరీ నుంచి మాయమయ్యారని ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ఆరోపించారు.