జనవరి 22న హైదరాబాద్​లో మానసిక వైద్యుల జాతీయ సమ్మేళనం

జనవరి 22న  హైదరాబాద్​లో మానసిక వైద్యుల జాతీయ సమ్మేళనం
  • దేశంపై మానసిక రుగ్మతల భారం

ఆరోగ్యం అంటే శరీరం, మనస్సు, ఆధ్యాత్మికత అన్న మూడూ సక్రమంగా ఉండడం.  ఆరోగ్యకరమైన జీవనశైలితో మనం దీర్ఘాయువును పొందవచ్చు.  అనారోగ్యం వల్ల శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  క్యూరియస్​ జర్నల్‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రచురించిన 2023 అధ్యయనం ప్రకారం,  భారతదేశం మానసిక ఆరోగ్య రుగ్మతల భారాన్ని ఎదుర్కొంటోంది. ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులపై ప్రభావం చూపుతోంది.  

అవగాహన లేకపోవడం, వివక్ష,  పరిమిత మౌలిక సదుపాయాలు వంటి అంశాలు భారతీయ జనాభాలో మానసిక అనారోగ్యం భారానికి దోహదం చేస్తాయి.  జాతీయ మానసిక ఆరోగ్య సర్వే (2015-–16) ప్రకారం దాదాపు 150 మిలియన్ల మంది భారతీయులకు మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరంకాగా,  కేవలం 30 మిలియన్ల కంటే తక్కువ మంది సంరక్షణను పొందుతున్నారు. 

భారతదేశ జనాభాలో 10.6% మంది మానసిక ఆరోగ్య పరిస్థితులతో జీవిస్తున్నారు.  అయినప్పటికీ మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరమైనవారిలో 76-–85% మంది ఎటువంటి వైద్య సేవలు పొందడం లేదు. ఇటీవల సంవత్సరాలలో, డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్స్,  బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా,  మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలు వంటి పరిస్థితులు జనాభాలో గణనీయమైన భాగాన్ని ప్రభావితం చేస్తున్న మానసిక ఆరోగ్య రుగ్మతల పెరుగుదలను భారతదేశం చూసింది. 

అరకొర బడ్జెట్లు

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో.. చికిత్స అంతరాలను పరిష్కరించడానికి,  మానసిక ఆరోగ్యానికి నిధులను పెంచడానికి నిబంధనలు ఉన్నప్పటికీ, ఇది తక్కువ పాలనా  ప్రాధాన్యతగా మిగిలిపోయింది. ఆరోగ్యం కోసం దేశం మొత్తం బడ్జెట్‌‌‌‌లో  1% కంటే తక్కువ మానసిక ఆరోగ్యానికి కేటాయించడమైంది.  భారతదేశంలో ఆత్మహత్య అనేది ఒక ముఖ్యమైన ఆందోళన. 2022లో  దేశంమొట్టమొదటి జాతీయ ఆత్మహత్య నిరోధక వ్యూహం (ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌పిఎస్‌‌‌‌) ప్రకటించింది.  

ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌పిఎస్‌‌‌‌  దేశంలో ఆత్మహత్యల సంఘటనలను తగ్గించడానికి ఇంటర్‌‌‌‌ సెక్టోరల్ విధానాన్ని అవలంబిస్తుంది. అయితే,  ప్రస్తుత బడ్జెట్‌‌‌‌లో  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌పిఎస్‌‌‌‌లో గుర్తించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణకు భారతదేశం బలమైన విధానం, శాసన ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ను కలిగి ఉన్నప్పటికీ, దాని అమలు తక్కువ పాలన ప్రాధాన్యతగా ఉంది.  

ఆరోగ్యంపై శ్రద్ధతోనే వ్యాధుల నివారణ

ఒక వ్యక్తి  మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం నేరుగా ఉత్పాదక జీవితాన్ని గడపడానికి సంబంధించినది.  శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరం అనేది శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కాబట్టి  మంచిస్థితిలో ఆరోగ్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం.  ఆరోగ్యవంతమైన వ్యక్తి సమాజానికి,  దేశానికి సేవ చేస్తాడు.  

వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తి చిన్న వయస్సు నుంచే ఆరోగ్యంపై  శ్రద్ధ పెడితే మాత్రమే వ్యాధులను నివారించవచ్చు.  మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం ద్వారా ఆస్పత్రిలో చేరే అవకాశాలను తగ్గించవచ్చు.  వైద్యచికిత్స కోసం అయ్యే ఖర్చును నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చుకోవచ్చు.  మొత్తం ఆరోగ్యంలో  మానసిక ఆరోగ్యం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.  సరైన నిద్ర,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

- డాక్టర్. బి. కేశవులు, సైకియాట్రిస్ట్-