కాశ్మీర్ ఎప్పుడూ పాక్​లో కలవదు: ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీర్ ఎప్పుడూ పాక్​లో కలవదు: ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ:  జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో టెర్రరిస్టుల దాడులకు పాకిస్తానే కారణమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇకపై ఇటువంటి దాడులకు ఆ దేశం ముగింపు పలకాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయిని హెచ్చరించారు. ఇండియాతో స్నేహపూర్వకంగా ఉండేందుకు సరైన మార్గం ఎంచుకోవాలని సూచించారు. ‘‘ఈ టెర్రరిస్టు దాడులకు మూలకారణం తెలుసు. 

30 ఏండ్లుగా అమాయక ప్రజలను మర్డర్ చేయడం చూశాను. నాతో కలిసి పనిచేసిన ఎందరో అమరులయ్యారు. కాశ్మీర్​ను పాకిస్తాన్​లో కలిపేందుకు ఈ దాడులు దోహదం చేస్తాయని పొరబడుతున్నట్టు ఉన్నారు. మేం ఎప్పుడు కూడా పాకిస్తాన్​లో భాగం కాలేము” అని అన్నారు. ‘‘పాకిస్తాన్​ తన సొంత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలి. ఈ టెర్రరిస్టు దాడులకు ముగింపు పలకాలి. ఇండియాతో స్నేహంగా ఉండేందుకు ఒక మార్గాన్ని కనుగొనాలి” అని అబ్దుల్లా సూచించారు. కాశ్మీర్ లో టెర్రరిజం నిర్మూలనకు మనం కూడా ఒక పరిష్కార మార్గాన్ని గుర్తించాలన్నారు.