- నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ చైర్మన్ చంద్రశేఖర్
ముషీరాబాద్,వెలుగు: బహిరంగ మార్కెట్ ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ చైర్మన్ వల్దాస్ చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హక్కులను ప్రజలు తెలుసుకున్నప్పుడే ప్రశ్నించ గలుగుతారని పేర్కొన్నారు. నేటికాలంలో మార్కెట్ లో అనేక మోసాలు, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కన్జ్యూమర్ రైట్స్ ను తెలుసుకునేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కుమ్మరి శ్రీకాంత్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.