డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)..హీరో ధనుష్ (Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ D51గా పట్టాలెక్కనున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు..రష్మిక తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..D51 మూవీతో న్యూ జర్నీ స్టార్ట్ అయినట్లు రష్మికపెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వర్సటైల్ యాక్టర్ ధనుష్, క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల..వీరిద్దరి కలయికలో రష్మిక ఫస్ట్ టైం వర్క్ చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.
రీసెంట్ గా D51 మూవీ నుంచి..రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేశారు శేఖర్ కమ్ముల. ఈ మూవీ సొసైటీని ఉద్దేశించే కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది.శేఖర్ కమ్ముల ఈ మూవీ స్క్రిప్ట్ కోసమే రెండేళ్లు వర్క్ చేసినట్లు తెలుస్తోంది.
సహజంగా శేఖర్ కమ్ముల చిత్రాల్లో కథా బలం ఎక్కువగా కనిపిస్తోంది.దానికి తోడు ధనుష్ లాంటి హీరోతో..రష్మిక జతకట్టడం ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.
ధనుష్ 51వ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్(Sree Venkateswara Cinemas)పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో ధనుష్‌ను మునుపెన్నడూ చూడని గెటప్ లో చూడబోతున్నట్టు సమాచారం.
We have been holding the news and excitement for long enough now ?
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 14, 2023
And its finally out now, can't wait for the beautiful journey ahead ❤️
See you in the sets soon ??✨ #D51 https://t.co/9N5FIm38qH