పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని యాదవ్ నగర్ లో పంట పొలాల్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ లోని ఓ కళాశాల విద్యార్థులు మహిళా రైతులతో కేక్ కట్ చేయించారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. అన్ని పండుగలాగే రైతు దినోత్సవాన్ని జరుపుకోవాలని, మహిళ రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
అనంతరం విద్యార్థులు రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. వ్యవసాయాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం తమకు సంతోషంగా ఉందని స్టూడెంట్స్ తెలిపారు. రైతులకు ఆత్యాధునిక సాంకేతిక పనిముట్లను ప్రభుత్వాలు అందజేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశానికి ఆహారం అందించే ప్రతి ఒక్క రైతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.