న్యూఢిల్లీ, వెలుగు: వైద్య రంగంలో విశిష్ట సేవలందించే నర్సులు, నర్సింగ్ వృత్తిలోనివారికి ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు (ఎన్ఎఫ్ఎన్ఏ) తెలంగాణకు చెందిన తేజావత్ సుశీల అందుకున్నారు. ఎన్ఎఫ్ఎన్ఏ 2022, 2023కు గాను దేశవ్యాప్తంగా 30 మందికి అవార్డులు ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రోగ్రా మ్లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సుశీల అవార్డును అందుకు న్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుట్ట పీహెచ్సీలో సుశీల ఏఎన్ఎంగా పని చేస్తు న్నారు. మారుమూల ప్రాంతాల్లోని గొత్తికోయల ఆవాసాలకు వెళ్లి అందిస్తో న్న సేవలకుగానూ ఈ అవార్డు వరించింది.