హల్ద్వానీ/డెహ్రాడూన్: ఇండియా యంగ్ స్విమ్మర్ ధినిధీ దేసింగ్.. నేషనల్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలతో మెరిసింది. బుధవారం జరిగిన విమెన్స్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో 14 ఏళ్ల దేసింగు 2:07.08 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరింది. విమెన్స్ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో దేసింగు 1:03.62 నిమిషాల్లో, విమెన్స్ 4X100 మీటర్ల ఫ్రీస్టయిల్లో దేసింగ్–నైనా వెంకటేశ్–శాలిని దీక్షిత్–లతిషా మంధానతో కూడిన బృందం 4:01.58 నిమిషాల్లో టార్గెట్‌ను పూర్తి చేసింది.
మెన్స్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 4X100మీ. ఫ్రీస్టయిల్లో శ్రీహరి నటరాజన్ రెండు గోల్డ్ మెడల్స్‌తో మెరిశాడు. ఓవరాల్‌గా తొలి రోజు కర్నాటక ఏడు (5 గోల్డ్, 2 సిల్వర్) మెడల్స్‌తో టాప్‌లో ఉంది.