- తెలంగాణ నుంచి 23 క్రీడల్లో 212 మంది పోటీ
డెహ్రాడూన్ : దేశంలో అతి పెద్ద క్రీడా పండగ నేషనల్ గేమ్స్‌కు సమయం ఆసన్నమయింది. ఈసారి స్టార్ ప్లేయర్లు బరిలో లేకపోయినా.. ఆటల్లో మేటి క్రీడాకారులను దేశానికి పరిచయం చేసే మెగా స్పోర్టింగ్ ఈవెంట్ మంగళవారం మొదలవనుంది. ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇస్తున్న 38వ నేషనల్ గేమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం ఏడు వేదికల్లో 18 రోజుల పాటు జరిగే గేమ్స్‌లో అయా రాష్ట్రాల నుంచి 10 వేల మంది క్రీడాకారులు 32 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు.
పోటీపడే అథ్లెట్ల సంఖ్య లెక్కన ఇది ప్రపంచంలోనే అది పెద్ద సోర్ట్స్ ఈవెంట్లలో ఒకటి కానుంది. ఫిబ్రవరి 14 వరకు జరిగే నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ నుంచి 212 మంది 23 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. ఇందులో 108 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు ఉన్నారు. 2022లో గుజరాత్లో జరిగిన గేమ్స్‌లో 8 స్వర్ణాలు సహా 23 పతకాలతో 15వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2023లో గోవాలో జరిగిన పోటీల్లో 4 స్వర్ణాలు సహా 27 పతకాలతో 22వ స్థానంతో సంతృప్తి చెందింది. ఈసారి పతకాల సంఖ్యతో పాటు తమ స్థానాన్ని మార్చుకోవాలని చూస్తోంది.