బీజేపీలో చేరిన మాజీ ఎంపీపీ

గంగాధర, వెలుగు: కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌‌చార్జి తరుణ్‌‌చుగ్​అన్నారు. ఆదివారం బీఆర్ఎస్​ సీనియర్​ నాయకుడు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, 12, 9వ వార్డు కౌన్సిలర్లు వేముల కవిత- చంద్రశేఖర్, స్వర్గం వజ్రాదేవి- నర్సయ్య , పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు కమటం రాజేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఒడ్నాల రవీందర్ బీజేపీలో చేరారు.

కొత్తపల్లి మండలం ఆసిఫ్​నగర్(బావుపేట), బద్దిపల్లి సర్పంచులు కడారి శాంత- శ్రీనివాస్, రాచమళ్ల మధు బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్​కుమార్​ సమక్షంలో బీజేపీలో చేరారు.