
జనగామ అర్బన్, వెలుగు : టీఎస్‌ఎన్‌జీసీ, జాతీయ హరితదళం ఆధ్వర్యంలో జనగామలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో కె. రాము మాట్లాడుతూ పర్యావరణం పట్ల బాధ్యతను, ప్రేమను పెంచుకోవాలని సూచించారు. అనంతరం సుస్థిర జీవన విధానం గురించి రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్స్ మేజర్ శివకిరణ్, వెంకటేశ్వర్, ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్‌లు వివరించారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న స్టూడెంట్లు, టీచర్లకు సర్టిఫికెట్లు అందజేశారు.