రామప్పను సందర్శించిన నేషనల్ గైడ్స్

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను నేషనల్ గైడ్స్ ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామప్ప గైడ్ ద్వారా ఇక్కడి చరిత్ర, శిల్పకళా నైపుణ్యం, సంస్కృతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయులు నిర్మించిన కట్టడాల్లో రామప్ప టెంపుల్ ఓ అద్భుతం అని కొనియాడారు.

 అనంతరం రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు. కార్యక్రమంలో నేషనల్ గైడ్స్ నాగ సుబ్రహ్మణ్యం, జయరాజ్ అజయ్ కుమార్, అరుణ్ కుమార్, అలెక్స్, సుఖండ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ దంపతులు రామప్ప టెంపుల్ సందర్శించారు.