ప్రజల ఆరోగ్యంపై జాతీయ సర్వే

ప్రజల ఆరోగ్యంపై జాతీయ సర్వే
  • జీవన శైలి వ్యాధులపై కొనసాగుతున్న జాతీయ సర్వే
  • 12 జిల్లాల్లో 71 శాతం పూర్తి
  • 2.78 లక్షల మందికి హైపర్‌ టెన్షన్‌
  • 2 లక్షల మందికి డయాబెటీస్‌
  • 7,297 మందికి నోటి కేన్సర్‌
  • మరో 10 జిల్లాల్లో
  • ప్రారంభమైన స్ర్కీనిం గ్

ఒకప్పుడు ప్లేగు,మలేరియా,క్షయ కలరా వంటి  వ్యాధులు ప్రపంచాన్ని వణికించాయి. ఇప్పుడుజీవన శైలి వ్యాధులు సవాల్ విసురుతున్నాయి. ప్రజలప్రాణాలు తీస్తున్నా యి. ఊబకాయంతో మొదలైమధుమేహం, గుండెపోటు, కిడ్నీ జబ్బులు, హైపర్‌ ‌టెన్షన్‌, కేన్సర్‌‌ వంటి వ్యాధులు ప్రపంచాన్ని పీడిస్తున్నా యి. ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇలాంటిజబ్బుల వల్లే సంభవిస్తున్నట్టు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సైతం స్పష్టం జేసింది. మారుతున్న జీవన శైలితో దశాబ్దకాలంగా ఇండియాలో నాన్‌ కమ్యూనికబుల్ డీసీజెస్‌(ఎన్సీడీ) పెరిగిపోతున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఎన్ సీడీపై దేశవ్యాప్తంగా సర్వే చేపడుతోంది. మన రాష్ర్టంలో వైద్యారోగ్యశాఖ పరిధిలో ఈ సర్వే కొనసాగుతోంది. మొత్తం మూడుదశల్లో ఈ సర్వే పూర్తి చేయనున్నారు.

వివరాల నమోదు ఇలా..

ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి 30 ఏళ్లు, ఆ పైన వయసు గల మహిళలు, పురుషులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో కార్యకర్త 30 మంది చొప్పునవివరాలు సేకరిస్తున్నారు. రక్తపోటు, మధుమేహంలాంటి వ్యాధులు ఉన్నట్టు పరీక్షలో తేలితే వారినిప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి, కేన్సర్‌‌ వంటి వ్యాధులబారిన పడినట్టు గుర్తిస్తే జిల్లా వైద్యశాలకు పంపిస్తారు. అక్కడ తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయిన వారికి అవసరమైన చికిత్స, మందులు అందిస్తారు. ఇంకా అవసరమైతే ఆధునిక వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేస్తారు. రోగుల కుటుంబనేపథ్యం , ఆహారపు అలవాట్లు, జీవన విధానంతదితర వివరాలను సేకరించి ట్యాబ్ లలో పొందుపరుస్తున్నా రు. ఈ పూర్తి వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసి ఆరోగ్య కార్డులు అందజేయనున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు అందించడం,మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందించేందుకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ ఉద్దేశం.

ఎంత మందికి ఏ జబ్బు?

తెలంగాణ రాష్ట్రంలో తొలి దశలో వరంగల్ అర్బన్,సంగారెడ్డి , మెదక్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల,జగిత్యాల, సిద్దిపేట, జనగామ, పెద్దపల్లి, వరంగల్‌రూరల్, మహబూబాబాద్, కరీంనగర్‌‌ జిల్లాల్లో సర్వేచేస్తున్నా రు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 12జిల్లాల్ లో 30 ఏళ్ల పైబడినవారు, 38 లక్షల70 వేలమంది ఉన్నా రు. వీరిలో 90 నుంచి 95 శాతం గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటివరకు 27,48,109(71%) మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులోఅత్యధికంగా 2,78,079 మంది హైపర్‌‌ టెన్షన్‌,2,04,041 మంది డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. 7,297 మందికి నోటి కేన్సర్‌,2,274 బ్రెస్ట్‌ కేన్సర్‌‌, 2,937 మందికి సర్వైకల్ కేన్సర్‌ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరందరికీ అవసరమైన మందులను అందజేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రెండో దశకు సంబంధించి మరో 10 జిల్లాల్లో ఫిబ్రవరిలో సర్వే ప్రారంభమైంది.ఆ జిల్లాల్లో ఇప్పటివరకూ 29 శాతం సర్వే అయినట్టుఅధికారులు తెలిపారు. మూడో దశ కింద 9 జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తయింది. త్వరలోనే స్ర్కీనింగ్ ప్రారంభించనున్నా రు. ఈ మొత్తం సర్వే పూర్తవగానే వ్యక్తుల అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రత్యేక హెల్త్‌ కార్డులు పంపిణీ చేయనున్నారు.వీటి ఆధారంగా వారికి ట్రీట్‌మెంట్‌ అందించడంతో పాటు ఉచితంగా అవసరమైన మందులు పంపిణీ చేయనున్నా రు.