పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ ను నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్ హెచ్ఎస్ఆర్ సీ) బృందం బుధవారం సందర్శించింది. డయాలసిస్, మెడికల్, ఆంకాలజీ తదితర విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
పేదలకు అందిస్తున్న ఆధునిక వైద్య చికిత్సలు, పరిశోధనలపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. బీరప్ప వారికి వివరించారు. నిమ్స్‌ను సందర్శించిన వారిలో ఎన్ హెచ్ఎస్ఆర్ సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అతుల్ కోత్వాల్, నేషనల్ హెల్త్ మిషన్ ఉత్తరాఖండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి ఎస్. భదూరియా, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఆశీమా ఉన్నారు.