ప్యాచ్‌‌‌‌ వర్క్ చేస్తలే.. కొత్త రోడ్డు వేస్తలే

నేషనల్ హైవే 161కు నో రిపేర్
రెండేళ్లు గా సాగనివిస్తరణ పనులు
సంగారెడ్డి టూ జోగిపేట రోడ్డునిండా గుంతలు

ఈ ఫొటోలో ఉన్నది నేషనల్‌‌‌‌ హైవే 161. సంగారెడ్డి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌మీదుగా అకోలా వరకు వెళ్తుంది. జిల్లాలో ఉన్న రెండు నేషనల్‌‌‌‌ హైవేల్లో ఇదీ ఒకటి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్‌లో సంగారెడ్డి, అన్నాసాగర్‌‌‌‌‌‌‌‌ మధ్య ఎక్కడా చూసినా పెద్ద పెద్ద గుంతలే కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా ఎలాంటి రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: ఈ రోడ్‌కు 2018లో సెంట్రల్‌ గవర్నమెంట్‌ నేషనల్‌ హైవే హోదా కల్పించింది. 140 కిలోమీటర పొడవున్న రూట్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు రూ.25వేల కోట్లుమంజూరు చేసింది. సర్వే పనులు కూడా రెండేళ క్రితమే పుర్తయ్యాయి. ఈ హైవే పనులు మెదక్ జిల్లా అల్లాదుర్గం సమీపంలో పూర్తి కావడానికి వచ్చాయి. కానీ సంగారెడ్డి జిల్లా పరిధిలో మాత్రంనెమ్మదిగా సాగుతున్నాయి. ఇక్కడి పనులకు టెండర్లు పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటివరకు అన్నాసాగర్ వయా జోగిపేట మీదుగా రోడ్డుకు ఇరువైపులా చెట్లుమాత్రమే నరికివేశారు. బైపాస్ రోడ్డులో అక్కడక్కడా పనులు జరుగుతున్నా చాలా స్లోగా సాగుతున్నాయి. ఆఫీసర్లు, లీడర్ల నిర్లక్ష్యం వల్లే ఫోర్‌‌‌‌‌‌‌‌లైన్ పనులకు మోక్షం లభించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతంత మాత్రంగా ఉన్న ఈ నేషనల్ హైవే కాస్తా జిల్లాలో ఇటీవల కురిసిన వానలకు గుంతలమయమై ప్రమాదకర స్థితికి చేరింది.

జోగిపేటలో అధ్వానం..
నేషనల్ హైవే వెళ్తున్న జోగిపేట మున్సిపాలిటీలో రోడ్‌ మరీ అధ్వానంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు ప్యాచ్ వర్కు లు చేసినా అవి నాసిరకంగా ఉండడంతో పరిస్థితి మళ్లీఎప్పటిలా మారింది. టౌన్‌‌‌‌లో పెద్ద పెద్దగుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆఫీసర్లు రిపేర్ల జోలలి పోతలేరు. కొత్త రోడ్డు వేయకపోవడం, ప్యాచ్‌‌‌‌వర్క్‌‌ ‌‌చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో సంగారెడ్డి -జోగిపేట మధ్యలో సుమారు 105 ప్రమాదాలు జరగ్గా, 21 మంది చనిపోయారు. 245 మంది గాయపడ్డారు. అడపాదడపా ఈ రోడ్‌కు ఇరువైపులా ఉన్న పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిగుంతలు పూడ్చుతున్నారు. కానీ అవి ఎంతో కాలం నిలవడం లేదు. ఆఫీసర్లు, లీడర్లు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సంగారెడ్డి, జోగిపేట వాసులు కోరుతున్నారు.

ఇంకెప్పుడు మొదలుపెడ్తరు..
నేషనల్ హైవే-161 జోగిపేట రోడ్డును మంచిగ చేయాలి. టెండర్లు ఖరారై ఏడాదిన్నర అయితుంది. ఇంకెప్పుడు పనులు మొదలు పెడ్తరు. పైసలున్నా పనులు చేయకుంటే ఎట్ల. రోడ్డు గురించి పట్టించుకునేటోళ్లే లేరు. ఆఫీసర్లు వెంటనే విస్తరణ పనులు చేయాలే.
– కిష్టా రెడ్డి (చక్రియాల్ సర్పంచ్)

గుంతలైనా పూడ్చండి
నేషనల్ హైవే పనులు లేట్ అయితే కనీసం గుంతలైనా పూడ్చండి. వాహనదారులు ఒక గుంతను తప్పించబోతే ఇంకో గుంతలో పడుతున్నరు. రెండేళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగినయ్‌. అయినా ఎవరూ పట్టించుకుంటలే. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు స్పందించి రిపేర్‌తోపాటు విస్తరణ పనులు త్వరగా కంప్లీట్‌‌‌‌ చేయాలె.
-సయ్య సాయి (జోగిపేట వాసి)