ఆదిలాబాద్ లో హైవే పనులు స్పీడప్..

ఆదిలాబాద్ లో హైవే పనులు స్పీడప్..
  • మహారాష్ట్ర నుంచి బోరజ్ వరకు ప్రారంభమైన రోడ్డు విస్తరణ
  • జిల్లాలో 33 కిలోమీటర్ల మేర విస్తరించిన 353 బి రోడ్డు
  • రూ.194 కోట్లతో నిర్మాణ పనులు
  • 2026 మేలో పూర్తిచేసేలా అగ్రిమెంట్

ఆదిలాబాద్, వెలుగు: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లా బేల మీదుగా చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు స్పీడ్​ అందుకున్నాయి.  గత మూడేళ్ల క్రితం ఈ రోడ్డు ఆర్​అండ్​బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు జాతీయ రహదారిగా అప్ గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఏండ్ల తర్వాత  గత నెలలో రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పూర్తయ్యి,   పనులు  ప్రారంభం అయ్యాయి.  ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి.  బేల మండల కేంద్రం నుంచి బైపాస్ రోడ్డు  కోసం భూ సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

కానీ అప్పట్లో రైతులు  వ్యతిరేకించడంతో  రోడ్డునే విస్తరించాలని  నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది రోడ్డు విస్తరణ కోసం అధికారులు ఆన్ లైన్ టెండర్లు పిలిచారు. దీంతో మహారాష్ట్రకు చెందిన ఆర్బీ ఘోడ్కే కాంట్రాక్ట్ సంస్థ టెండర్లను దక్కించుకుంది. జాతీయ రహదారి సంస్థ అధికారులు ముందుగా ఈ రోడ్డు విస్తరణ  కోసం రూ. 360 కోట్ల ఎస్టిమేషన్ తో టెండర్లు పిలిచినప్పటికీ అంతకంటే తక్కువగా 46 శాతం తక్కువలో లో రూ.194 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు సదరు సంస్థ ముందుకు వచ్చింది.   2026 మే లోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. 

విస్తరణ పనులు ఇలా..

భారత్ మాల కింద చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ మీదుగా భోరజ్ జాతీయ రహదారి 44 వరకు ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44 నెంబర్ జాతీయ రహదారికి ఈ 353 బీ రోడ్డు అప్రోచ్ రహదారిగా నిలవనుంది. మహారాష్ట్రలోని నుంచి అష్టి నుంచి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా మన జిల్లాలో బేల నుంచి జైనథ్ మండలంలోని భరోజ్ వరకు జరుగనున్నాయి. 

ఈ మొత్తం రహదారి   141 కిలోమీటర్లు ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో బేల నుంచి జైనథ్ మండలం బోరజ్ వరకు 33 కిలోమీటర్ల విస్తరించి ఉంది. అయితే మహారాష్ట్రలో మాత్రం నేషన్ హైవే ఫోర్ లేన్​గా   విస్తరిస్తుండగా మన జిల్లాలో మాత్రం బైపాస్ రోడ్డుగానే నిర్మిస్తున్నారు. బేల నుంచి బోరజ్ వరకు 7 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును 10 మీటర్లకు పెంచుతున్నారు.  ప్రస్తుతం కల్వర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పది కల్వర్లు పనులు కూడా పూర్తయ్యాయయని, మిగతా పనులు సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

33 కిలోమీటర్ల రహదారిలో తర్నం గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుండగా, నిరాల, బెల్గాం, బేల లో మరో మూడు చిన్న బ్రిడ్జీలు నిర్మించనున్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను సైతం నిర్మించనున్నారు. దీంతో పాటు భోరజ్ వద్ద అప్రోడ్ రోడ్డు కోసం మూడు ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 

వాణిజ్య అభివృద్ధి కి తోడ్పాటు..

మహారాష్ట్ర నుంచి బేల, జైనథ్ బోరజ్ నేషనల్ హైవే 44 వరకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడుస్తాయి. ప్రయాణికులకు సంబంధించిన వాటితో పాటు నిత్యం వ్యాపారాలకు సంబంధించిన లారీలు వెళ్తుంటాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలోని రాజురా, గడ్ చందూర్, చంద్రపూర్ ఉన్న సిమెంట్ ప్యాక్టరీలకు సిమెంట్ లారీలు, బొగ్గు, సరుకులు వంటివి ఈ రోడ్డు మార్గంలోనే తెలంగాణ కు రవాణా అవుతాయి. ఆదిలాబాద్ -బేల సెక్షన్ లోని డబుల్ లేన్ విస్తరణ వల్ల మహారాష్ట్ర, తెలంగాణకు రవాణా సదుపాయాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతాయి. 

పనులు వేగంగా జరుగుతున్నయి

జిల్లాలో 353 బి జాతీయ రహదారి గత అక్టోబర్ లో పనులు ప్రారంభం కాగా మొదట్లో నెమ్మదిగా సాగాయి. గత పదిహేను రోజుల నుంచి పనులు స్పీడ్ గా సాగుతున్నాయి. పనులు చేపట్టిన కాట్రాక్ట్ సంస్థకు ఇచ్చిన గడువు 2026 మేలోగా పూర్తయ్యేలా చూస్తాం. 46 శాతం లెస్ తో పనులు చేపట్టినప్పటికీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకున్నాం. రోడ్డు పునలు పూర్తైన తర్వాత ఐదేళ్లు మెయింటెన్స్ చేసే బాధ్యత కూడా సంస్థపై ఉంది. - సుభాష్, డీఈ నేషనల్ హైవే