- ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ ను కోరిన మోర్త్ ఏడీజీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ స్లోగా ఉందని దీనిని స్పీడప్ చేయాలని ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ను మోర్త్ ( మినిస్ర్టి ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ కోరారు. రాష్ర్ట పర్యటనకు వచ్చిన ఏడీజీ బుధవారం సెక్రటేరియెట్ లో వికాస్ రాజ్ తో భేటీ అయ్యారు.
పలు ప్రాజెక్టుకులకు ఫారెస్ట్ అనుమతులు రావాల్సి ఉందని, పీసీసీఎఫ్ తో మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవ చూపాలని తెలిపారు. భూసేకరణ స్పీడప్ చేయటంతో పాటు ఫారెస్ట్ అనుమతులు త్వరగా వస్తేనే నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు పనులు వేగంగా సాగుతాయని రాజీవ్ సింగ్ స్పష్టం చేశారు.