గ్రీన్ ​ట్రిబ్యునల్​లో కేసుతోనే హైవే పనులు లేట్

గ్రీన్ ​ట్రిబ్యునల్​లో కేసుతోనే హైవే పనులు లేట్
  • చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ 

చేవెళ్ల, వెలుగు: నేషనల్​గ్రీన్ ​ట్రిబ్యునల్​లో కేసు కారణంగానే నేషనల్​హైవే 163 విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ వెల్లడించారు. ఆలూరు స్టేజీ వద్ద లారీ యాక్సిడెంట్​జరగడంతో ఆర్డీఓ స్పందించారు. 2017లోనే హైవేకు నిధులు మంజూరయ్యాయని, భూ సేకరణ పూర్తయిందని తెలిపారు. 800 మంది రైతులకు నష్ట పరిహారం చెల్లించామన్నారు. 

రోడ్డుకు ఇరువైపులా 1000 భారీ మర్రిచెట్లు ఉన్నాయని, హైవే విస్తరణలో భాగంగా వాటిని తొలగించవద్దని 2021లో  తేజపు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించాడని, స్టేటస్​కో  రావడంతో అప్పుడు పనులు ఆగాయని చెప్పారు. 2023 నవంబర్​6న ఎన్జీటీ కేసును క్లోజ్​ చేస్తూ కేంద్ర పర్యారణ శాఖ నుంచి అనుమతి తీసుకుని రోడ్డు విస్తరించాలని సూచించిందన్నారు. 

అన్ని అనుమతులు వచ్చాక గత జనవరిలో తేజపు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారని, ప్రస్తుతం స్టేటస్​కో ఉందని చెప్పారు. కాగా ఎన్​హెచ్​163ని పూర్తిచేసి చేవెళ్ల ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్​నేత కార్తీక్​రెడ్డి  చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళకు, చేవెళ్ల సీఐ భూపాల్​శ్రీధర్​కు  వినతిపత్రం సమర్పించారు.