ఆవిష్కరణ మెరిసింది.. జపాన్ పిలిచింది

ఆవిష్కరణ మెరిసింది.. జపాన్ పిలిచింది

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జడ్పీ హైస్కూల్​స్టూడెంట్, జాతీయ ఇన్​స్పైర్​అవార్డు గ్రహీత ​మణిప్రసాద్ కు అరుదైన అవకాంశం దక్కింది. జపాన్​లో వచ్చే మే నెలలో  నిర్వహించే సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మణిప్రసాద్​కు ఆహ్వానం అందిందని డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. నూతన సాంకేతికతను తెలుసుకొని మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ఆ ప్రోగ్రాం ఉపయోగపడుతుందన్నారు.

 మణిప్రసాద్​ గత అక్టోబర్​లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఇన్​స్పైర్ ​పోటీల్లో ప్రతిభ చాటి సెంట్రల్​ సైన్స్ ​అండ్​ టెక్నాలజీ మినిస్టర్ ​డాక్టర్​ జితేందర్ సింగ్ తోమర్​ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మణిప్రసాద్, గైడ్ ​సురేందర్​, హెచ్ఎం రమేశ్​ను డీఈఓ యాదయ్య, సెక్టోరల్​ కో ఆర్డినేటర్ చౌదరి, జిల్లా సైన్స్ ఆఫీసర్​ మధుబాబు అభినందించారు.