
కాజీపేట, వెలుగు: కాజీపేటలోని ఎన్‌ఐటీలో నిర్వహించిన స్ర్పింగ్ స్ర్పీ 2025 ఆదివారంతో ముగిసింది. శనివారం రాత్రి సింగర్ గీతామాధురి పాటలు పాడగా, మ్యాడ్ 2 సినిమా హీరో నార్నె నితిన్ స్టూడెంట్లతో మాట్లాడారు. ఆదివారం గాయకుడు నిఖిల్ డిసౌజా నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. సాయంత్రం స్టూడెంట్లు నుక్కడ్ నాటకాన్ని ప్రదర్శించారు. చివరగా రాత్రి నిర్వహించిన ఫ్యాషన్ షో పలువురిని ఆకట్టుకుంది.