
కటక్: సీనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సర్వీసెస్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం రైల్వేస్, సర్వీసెస్ మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ 30–30తో డ్రా అయ్యింది. అయితే టైబ్రేక్‌లో సర్వీసెస్ 6–4తో రైల్వేస్‌కు చెక్ పెట్టి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ నవీన్ కుమార్ ఆల్‌రౌండ్ షోతో సర్వీసెస్‌కు అండగా నిలిచాడు. రైడర్ పంకజ్ మోహితే, డిఫెండర్ పర్వేశ్ భన్సీవాల్, జైదీప్ దహియా, రాహుల్ సెత్‌పాల్ కీలక సమయంలో పాయింట్లు అందించారు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సర్వీసెస్ 43–35తో పంజాబ్‌పై, రైల్వేస్ 42–34తో ఉత్తరప్రదేశ్‌పై గెలిచి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాయి.