
జనగామ అర్బన్/ హనుమకొండ/ కాశీబుగ్గ/ తొర్రూరు, వెలుగు: కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని అధికారులు అన్నారు. గురువారం జాతీయ కుష్టు నిర్మూలన రోజు సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జనగామ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హనుమకొండ ఫాదర్ కొలంబో నర్సింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ప్రోగ్రామ్లో డీఎంహెచ్వో అప్పయ్య, వరంగల్ ఫాతిమానగర్లో డీఎంహెచ్వో సాంబశివరావు, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ పాల్గొని మాట్లాడారు.
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు హెల్త్ ఆఫీసర్లకు ప్రశంసాపత్రాలు అందించారు.