మల్లాపూర్​లో బాడీ బిల్డింగ్ పోటీలు

మల్లాపూర్​లో బాడీ బిల్డింగ్ పోటీలు

నాచారం వెలుగు : ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ఆదివారం మల్లాపూర్ లో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. సౌత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 300 మంది బాడీ బిల్డర్స్ పాల్గొనగా, వివిధ కేటగిరీల్లో గెలుపొందిన వారికి రూ.75 వేల ఎలక్ట్రిక్ బైక్​తోపాటు మెడల్స్ అందజేశారు. 

అంతర్జాతీయ స్థాయి పోటీలకు బాడీ బిల్డర్స్​ను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఏజీ క్లాసిక్ నిర్వాహకులు గౌతమ్, అభిషేక్, పరమేశ్ వెంకట్ తెలిపారు.