జనవరి 11న జాతీయ స్థాయి కరాటే పోటీలు

నర్సంపేట, వెలుగు : చోటో ఖాన్‌‌‌‌‌‌‌‌ జపాన్‌‌‌‌‌‌‌‌ కరాటే సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11న వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సంపేటలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు సంబంధించిన లోగోను ఆదివారం సంస్థ ప్రతినిధులతో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 13 రాష్ట్రాలకు చెందిన దాదాపు 1,200 మంది కరాటే పోటీల్లో పాల్గొననున్నారని నిర్వాహకులు చెప్పారు. పద్మశాలి గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రచ్చ శ్రీనుబాబు, పాలాయి రవి, నిరంజన్, గుంటి అశోక్, విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, శివసాయికుమార్, అఖిల్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.