వరంగల్​లో రాజీతో పెండింగ్​ కేసులు క్లియర్..!​

వరంగల్​లో రాజీతో పెండింగ్​ కేసులు క్లియర్..!​
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ ​అదాలత్​ సక్సెస్​
  • అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 7741 కేసుల పరిష్కారం
  • వరంగల్​లో 3877, ములుగు​​లో 1156 కేసులు 

హనుమకొండ సిటీ/ మహబూబాబాద్​అర్బన్/ తొర్రూరు/ములుగు, వెలుగు: ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం నేషనల్​ లోక్​అదాలత్. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న క్రిమినల్​, భూ తగాదాల వంటి వాటిని రాజీమార్గం ద్వారా పరిష్కరించారు.​

 ​హనుమకొండలో..

హనుమకొండ అదాలత్ లో జాతీయ లోక్ అదాలత్ న్యాయ సేవా సంస్థ భవనంలో వరంగల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ,న్యాయ సేవా సంస్థ చైర్మన్ బీవీ నిర్మలా గీతాంబ లోక్​అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం రాత్రి 7గంటల వరకు వరంగల్ జిల్లాలో 9 బెంచీలను ఏర్పాటు చేసి, 3877 పెండింగ్ కేసులను పరిష్కరించారు. హనుమకొండలో 8 బెంచీలను ఏర్పాటు చేసి, 7741 పెండింగ్ కేసులను పరిష్కరించారు.

కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఇన్​చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్జిలు ప్రేమలత, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్ జిల్లాన్యాయ సేవా సంస్థ కార్యదర్శి సాయికుమార్, హనుమకొండ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉపేందర్ రావు, వరంగల్ ఏసీపీ తిరుపతి, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్స జనార్దన్, హనుమకొండ జిల్లా చీఫ్​ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీకాంత్ పాల్గొన్నారు. 

మహబూబాబాద్​ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్​అదాలత్​లో సీనియర్ సివిల్ జడ్జి సురేశ్ సమక్షంలో కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, న్యాయవాదులు పద్మాకర్ రెడ్డి, పీపీ చిలుకమారి వెంకటేశ్వర్లు, జిల్లా కోర్టు పరిపాలనధికారి క్రాంతికుమార్, న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులున్నారు.

తొర్రూరు జూనియర్​సివిల్​కోర్టులో నిర్వహించిన లోక్​అదాలత్​ కార్యక్రమంలో జూనియర్​సివిల్​కోర్టు జడ్జి సరిత ఆధ్వర్యంలో 61 క్రిమినల్​ కేసులు రాజీకాగా, రూ.83వేల జరిమానా విధించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 18, బ్యాంక్ రికవరీ 6, ఎక్సైజ్​ కేసులు 16 కేసులు పరిష్కరించి, జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీపీ రేవతి దేవి, రామకృష్ణ, కృపావతి, సీఐ జగదీశ్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. 

ములుగు జిల్లాలో...

ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 1156 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్ వీపీ సూర్య చంద్ర కళ తెలిపారు. నాలుగు బెంచీలను ఏర్పాటు చేసి ఎంవీవోపీ కేసులు 17, కాంపిన్సేషన్ రూ.1,24,05,000, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు 976, ఎక్సైజ్  61, సివిల్ 90, మెంటనేన్స్  2,  అలాగే ప్రీ లిటిగేషన్ సైబర్ క్రైమ్, బీఎస్ ఎన్ ఎల్ కేసులు 10, రికవరీ రూ.60,657 చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.రామ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జే.సౌక్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.