హైదరాబాద్, వెలుగు: ఎఫ్‌ఎంసీజీతోపాటు నిత్యావసర వస్తువులను అమ్మే నేషనల్ మార్ట్ - హైదరాబాద్‌లో మరో స్టోర్‌ను ఓపెన్ చేసింది. మేడ్చల్‌లో దీనిని 40 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసింది.
ఇక్కడ కిరాణాపాటు పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయెన్సెస్, కుక్ వేర్, పాదరక్షలు, దుస్తులను సరసమైన ధరలకు అందిస్తున్నామని నేషనల్ మార్ట్ ఫౌండర్ యశ్ అగర్వాల్ చెప్పారు. స్టైల్ మార్ట్ పేరుతో సొంత బ్రాండ్ దుస్తులను అమ్ముతున్నామని పేర్కొన్నారు.