హైదరాబాద్, వెలుగు : రిటైల్ చెయిన్నేషనల్ మార్ట్ విస్తరణ బాట పట్టింది. ఇది వరకే సంస్థ 11 స్టోర్లను నిర్వహిస్తుండగా, తాజాగా 12 స్టోర్‌ను హన్మకొండలో మొదలుపెట్టింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై స్టోర్‌ను ప్రారంభించారు.
ఈ స్టోర్ 40వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉందని సంస్థ తెలిపింది. అన్ని ప్రొడక్టులను అందుబాటులో ధరల్లోనే అందిస్తామని హామీ ఇచ్చింది. పలు ప్రొడక్టులపై ఆఫర్లు ఉన్నాయని తెలియజేసింది.