సిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద సీట్లకు అనుమతి

  • వంద సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ

  • పెండింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్మల్, కరీంనగర్ పర్మిషన్ 

హైదరాబాద్, వెలుగు: సిరిసిల్ల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ సీట్లకు పర్మిషన్ ఇస్తూ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌కు లేఖ పంపింది. కాలేజీ, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అవసరమైన సౌలత్​లు కల్పిస్తామని, బిల్డింగుల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, డాక్టర్లు, నర్సులు ఇతర స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను సరిపడా రిక్రూట్ చేస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాలని సూచించింది. ఇందుకు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సిద్ధంగా ఉంది. ఇదివరకు కూడా పలు కాలేజీలకు ఇలాగే అండర్ టేకింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీల కోసం ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ దరఖాస్తు చేసింది.

ఒక్కో కాలేజీలో వంద  సీట్లు ఇవ్వాలని కోరింది. ఇందులో సిరిసిల్ల, జనగాం, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి కాలేజీలకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ పర్మిషన్ వచ్చింది. నిర్మల్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు పర్మిషన్ రావాల్సి ఉంది. ఆ రెండింటికి కూడా పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. సిరిసిల్ల కాలేజీకి పర్మిషన్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు శనివారం ట్వీట్ చేశారు.