
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ప్రైవేటు మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పర్మిషన్ ఇచ్చింది. హైదరాబాద్-– విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది నుంచే ఆ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతులు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండు రౌండ్లు ముగిసింది. చివరి రౌండ్ కౌన్సెలింగ్‌లో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 సీట్లలో, 75 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.