అనురాగ్ వర్సిటీకి మెడికల్ కాలేజీ.. ఇదే తొలిసారి

అనురాగ్ వర్సిటీకి మెడికల్ కాలేజీ.. ఇదే తొలిసారి

హైదరాబాద్, వెలుగు: అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి నేషనల్  మెడికల్  కమిషన్  (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు ఓకే చెప్పింది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా జీడిమెట్ల క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ కాలేజీకి నీలిమ ఇన్​స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని పేరు పెట్టారు. రాష్ట్రంలో ఓ ప్రైవేటు వర్సిటీకి అఫిలియేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మెడికల్ కాలేజీని మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్  కాలేజీలు అన్నీ కాళోజీ హెల్త్  వర్సిటీ పరిధిలో ఉన్నాయి. అడ్మిషన్లు, ఎగ్జామ్స్ నిర్వహణ అంతా ఆ యూనివర్సిటీనే చూసుకుంటున్నది. అనురాగ్  వర్సిటీ కింద ఇప్పుడు అనుమతి పొందిన నీలిమ కాలేజీలో అడ్మిషన్లు, ఎగ్జామ్స్ ఎవరు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని కాళోజీ వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

11 వచ్చినయి.. లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 2

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 3 ప్రైవేటు, 7ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సహా మొత్తం 10 కాలేజీలకు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ పర్మిషన్  ఇచ్చింది. తాజాగా నీలిమ కాలేజీతో కలిపి ఈ సంఖ్య 11కు చేరింది. వీటిలో 1,300 ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీట్లు ఉన్నాయి. ఇంకొన్ని ప్రైవేటు కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచుకునేందుకు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నల్  వచ్చింది. ఇవికాక ఇంకో ప్రైవేటు కాలేజీ, రెండు ప్రభుత్వ కాలేజీలు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.