
- నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
- మరో ఐదుగురిపై కేసులు
జీడిమెట్ల, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లినిక్‌లపై నేషనల్ మెడికల్ కౌన్సిల్‌సభ్యులు కొరడా ఝళిపిస్తున్నారు. శుక్రవారం నిజాంపేటలో 2, మల్లంపేటలో 4 క్లినిక్స్‌లో తనిఖీలు చేశారు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా హాస్పిటళ్ల పేరుతో బోర్డులు పెట్టి, వీటిల్లో ప్రమాదకరమైన యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లను రోగులకు ఇస్తున్నట్లు గమనించారు. బాచుపల్లిలోని బుచ్చిబాబు క్లినిక్‌లో అరుణ కుమారి అనే ఒక మహిళ పదో తరగతి కూడా పాస్ కాకుండా లెటర్ ప్యాడ్‌పై డాక్టర్ అని రాసుకుని వైద్యం చేస్తుండడాన్ని గుర్తించారు.
ఈమె ఏకంగా మహిళలకు అబార్షన్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ వైస్‌చైర్మన్ డా.శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని క్లినిక్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 400 కేసులు నమోదు చేశామని హైదరాబాద్‌లో 150 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో తెలంగాణ కమిటీ సభ్యులు ఇమ్రాన్, విష్ణు తదితరలు పాల్గొన్నారు.