
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 193 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు : ట్రేడ్ అప్రెంటిస్‌లో ఎలక్ట్రీషియన్ 27, మెషినిస్ట్ 4, ఫిట్టర్ 12, వెల్డర్ 23, డీజిల్ మెకానిక్ 22, మోటార్ వెహికల్ మెకానిక్ 12, కోపా 47 ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ 1, సివిల్ ఇంజినీరింగ్ 6, కంప్యూటర్ ఇంజినీరింగ్ 1, ఈఈఈ 2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 6, మెకానికల్ ఇంజినీరింగ్ 8, మైనింగ్ ఇంజినీరింగ్ 10, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ 1 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3, మెకానికల్ ఇంజినీరింగ్ 4, మైనింగ్ ఇంజినీరింగ్ 1చొప్పున ఉన్నాయి.
అర్హతలు : సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, నాలుగేండ్ల ఇంజినీరింగ్ డిగ్రీ, మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి.
ఇంటర్వ్యూలు : ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మే 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలకు మే 7, 8 తేదీల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాలకు nmdc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.