మైనారిటీలంటే ఇంత చులకనా? : నేషనల్​ మైనారిటీ కమిషన్ మెంబర్ ​షహజాదీ

నేనేం టైమ్​పాస్ ​చేయడానికి రాలే..

మీటింగ్​కు ఖమ్మం కలెక్టర్, సీపీ రాకుండా అవమానపరిచిన్రు 

మైనారిటీలంటే ఇంత చులకనా? 

నేషనల్​ మైనారిటీ కమిషన్ మెంబర్ ​షహజాదీ ఫైర్​

ఖమ్మం, వెలుగు : నేషనల్​ మైనారిటీ కమిషన్ మెంబర్​షహజాదీ.. ఖమ్మం జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ ​వారియర్​లపై ఫైర్​ అయ్యారు. గురువారం కలెక్టరేట్​లో అధికారులతో మైనార్టీల సంక్షేమం కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్​ హాజరు కాలేదు. ఆమె మాట్లాడుతూ తాను టైమ్ పాస్ చేయడానికి ఇక్కడికి రాలేదని, తనను ఆ ఇద్దరు ఉన్నతాధికారులు అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలంటే ఇంత చులకనభావం తగదన్నారు.

కలెక్టర్ కి ఫోన్ చేసి పిలవాలని అడిషనల్ కలెక్టర్ కు సూచించారు. కలెక్టర్, సీపీ వచ్చేంత వరకు మీటింగ్ జరగదని భీష్మించుకూర్చున్నారు. కలెక్టర్ ఎలా రాడో చూద్దామన్నారు. వారిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. విషయం తెలుసుకున్న ముస్లిం మహిళా సంఘాలు నేషనల్​ మైనార్టీ కమిషన్​ మెంబర్​ను అవమానపరిచారంటూ జడ్పీ సెంటర్ లో కలెక్టర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు కలెక్టర్, సీపీకి సంఘీభావంగా కలెక్టరేట్ లోని ఉద్యోగులు లంచ్​ టైంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.